English | Telugu
ఊపిరిలో మిస్ అయ్యే 8 ఎలిమెంట్స్..!
Updated : Mar 26, 2016
ఊపిరి రిలీజై మంచిపేరు తెచ్చుకుంది. కానీ ఈ సినిమాలో చాలా మిస్సయ్యాయి. ప్రతీ తెలుగు సినిమాలోనూ ఉండాల్సిన ఇవి లేకపోతే ఎలా. మరి అంతలా మిస్సైనవి ఏంటో తెలుసా..? చూద్దాం రండి..
1. విలన్ మిస్సు
ఇద్దరు పేద్ద హీరోలున్నారే..కనీసం వాళ్లకు సరిపడా హైట్ అండ్ వెయిట్ లో ఒక్క విలన్ కూడా దొరకలేదటండీ మీకు..? అసలు విలనే లేకుండా సినిమా ఎలా నడిపించేశారండీ బాబూ..? కనీసం కాఫీ తీసుకురావే కోడలా.. అంటూ ఒక గయ్యాళి అత్త క్యారెక్టర్ ను పెట్టినా విలనిజం వచ్చేసేదిగా. మిస్సు మిస్సు..విలన్ మిస్సు.
2. సీరియస్ ట్విస్టులు మిస్సు
తెలుగు సినిమా అంటే ఏంటి. అబ్బో ఆ ట్విస్టులు, ఇంటర్వెల్ బ్యాంగ్ లు, ఇలా ఎన్ని ఉంటాయి. కానీ ఇలాంటివేమీ ఊపిరిలో కనిపించలేదేంటబ్బా..! అదేంటో పాపం.. ఫుల్లు ప్లెయిన్ గానే సినిమా అంతా వెళ్లిపోతుంది. ఎక్కడో ఒకచోట ఏదో ట్విస్ట్ ఇస్తారనుకుంటే, ఊహూ అలాంటిదేమీ ఉండదు. సీరియస్ ట్విస్టులు మిస్సు.
3. ఫైట్స్ మిస్సు
ఏవండీ అసలు ఫైట్స్ లేని తెలుగు సినిమా ఉంటుందా..? ఉన్నా హిట్ అవుద్దా..? కానీ అదేంటో ఊపిరి మాత్రం ఫైటింగ్స్ లేకుండానే రిలీజైపోయింది. సినిమాలో ఒక్క ఫైటూ ఉండదు. అరే ఇద్దరు స్టార్ హీరోలున్నారే. ఒక్కటంటే ఒక్క డిష్యుం డిష్యుం అయినా ఉంటుందేమో అని థియేటర్ కు వెళ్తే, అవి పూర్తిగా మిస్సు.
4. రొమాంటిక్ డ్యూయెట్స్ మిస్సు
నాగార్జున రొమాంటిక్ కింగ్. కార్తీ యంగ్ హీరో. ఇలాంటి వాళ్లిద్దర్ని పెట్టుకుని ఆరు పాటలేసేసుకోకుండా, సింపుల్ గా లాగించేశారేంటి.. ఆ ఏదో ఒక పాట పెట్టారులెండి. కానీ కింగ్ తో కనీసం ఒక్కటంటే ఒక్కసాంగ్ అయినా, డ్రీమ్ లోనైనా రోమాంటిక్ గా స్టెప్స్ వేయిస్తే అయిపోయేదిగా. ఏంటో రొటీన్ ఫార్ములాను అసలు పట్టించుకోనే లేదు. రొమాంటిక్ డ్యూయెట్స్ మిస్సు.
5. సీరియస్ ఫ్లాష్ బ్యాక్ మిస్సు
అబ్బో ఆయన గురించి ఏమనుకుంటున్నావ్..ఒకప్పుడు ఆయనేంటో తెలుసా.. అంటూ ఒక సీరియస్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంటే, కళ్లప్పగించి చూడటం తెలుగు ఆడియన్స్ కు చాలా ఇష్టం. ఊపిరిలో ఆ రేంజ్ ఫ్లాష్ బ్యాక్ లేదేంటండీ. ఉన్న ఒక్కటీ చాలా సింపుల్ ప్లెయిన్ ఫ్లాష్ బ్యాకు. అసలు ఇది తెలుగోళ్లకు ఎలా కుదురుద్దండీ..? ఎలా..? హౌ...? భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ మిస్సు.
6. నెగటివ్ ఫీలింగులు మిస్సు
తెలుగు సినిమా అంటే ఎలా ఉండాలి..? ఆ ఇగోలు, క్లాష్ లు, కోపాలు ఏ రేంజ్ లో ఉండాలి..? ప్రేక్షకుడికి ఆవేశం ఎక్కువైపోయి, కుర్చీలకు వేసిన కవర్లు చింపేయాలి.. ఆ రేంజ్ ఫీలింగ్స్ ఉంటేనే తెలుగు సినిమా.. కానీ ఊపిరిలో ఏంటండీ ఒక్క నెగటివ్ ఫీలింగూ రాదూ.? సినిమా అంతా ఒకటే ఆహ్లాదకరమైన ఫీలింగ్ వస్తుంది. నెగటివ్ ఫీలింగ్స్ పూర్తిగా మిస్సు..
7. కామెడీ ట్రాక్ మిస్సు
బ్రహ్మానందం ఏడి..రఘబాబు ఏడి..అసలు కమెడియన్స్ లేకుండా సినిమా తీస్తారండీ మన తెలుగోళ్లు..? ఎంత ధైర్యం ఉంటే సినిమాను ఇలా తీస్తారు..? నాగ్, కార్తీలతోనే సినిమా కామెడీని నడిపించి పండిచేశారు. ఆ సెపరేట్ ట్రాక్ లు ఎక్కడ..? ఆ రొటీన్ కామెడీ ఎక్కడ..ఎక్కడ..? అది మిస్సు..
8. కన్నీళ్లు మిస్సు
తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి బయటికొచ్చేలోపు, ఒక్కొక్కళ్లూ నాలుగైదు ఖర్చీప్ లు తడిపేయాలి. వాటర్ తో కాదండీ కన్నీటితో.. ఆ సెంటిమెంటూ, ఇన్నాళ్లూ ఇంత బాధ గుండెల్లో దాచుకుని నవ్వుతూ తిరిగావా బాబూ అంటూ సెంటిమెంటల్ డైలాగులు..ఇలా ఎంత సెంటిమెంట్ ఉండాలి..? కానీ ఊపిరిలో ఆనందం తప్ప బాధ రాదు. మిస్సింగండీ..కన్నీళ్లు పూర్తిగా మిస్సింగు..
అదండీ విషయం. మరి మీరు సినిమాకు వెళ్తారో లేదో తెలియదు కానీ, సినిమాలో ఇప్పటివరకూ చెప్పినవన్నీ మిస్సింగే. రొటీన్ రొట్ట కథలే చూద్దామనుకునేవాళ్లు మాత్రం ఊపిరి హాల్ చుట్టుపక్కలకు వెళ్లద్దు. చూశారుగా..మీక్కావాల్సినవేవీ ఉండవు. అన్నీ మిస్సింగ్ మరి..