English | Telugu

'ఊ అంటావా మావ'.. సమంత తగ్గేదేలే!

2010 లో 'ఏమాయ చేసావే' సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన సమంత.. ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్క స్పెషల్ సాంగ్ కూడా చేయలేదు. మొదటిసారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'తోనే స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అయింది సమంత. దీంతో ఈ సాంగ్ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది.

Also Read:బాలీవుడ్ లో సమంత హవా మొదలైంది.. 'రాజీ'కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్!

మొదటి సినిమా 'ఆర్య' నుంచి సుకుమార్ దర్శకత్వం వహించే అన్ని సినిమాలకు దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో అన్ని సినిమాలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక వీరికి బన్నీ తోడైతే సాంగ్స్ మరో స్థాయికి వెళ్తాయనే చెప్పాలి. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య-2 మ్యూజికల్ గా ఎంత విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. ముఖ్యంగా ఆర్య లోని 'అ అంటే అమలాపురం', ఆర్య-2 లోని 'రింగ రింగ' ఐటమ్ సాంగ్స్ సంచలనం సృష్టించాయి. దీంతో వీరి కాంబినేషన్ లో వస్తున్న పుష్ప లోని స్పెషల్ సాంగ్ పై ఆసక్తి నెలకొంది. దీనికి తోడు సమంత చిందేస్తున్న మొదటి స్పెషల్ సాంగ్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు.

Also Read:'ల‌క్ష్య' మూవీ రివ్యూ

'ఊ అంటావా.. ఊఊ అంటావా' అంటూ సాగే పుష్ప స్పెషల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. స్పెషల్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో దిట్ట అయిన దేవిశ్రీ మరోసారి మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. చంద్రబోస్ అందించిన క్యాచీ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఇక లిరికల్ వీడియోలో సమంత గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమంత అందం, ఇంద్రావతి చౌహన్ గాత్రం కుర్రకారుకి మత్తెక్కించేలా ఉన్నాయి. మొత్తానికి సమంత 'ఊ అంటావా' అంటూ మాస్ ని అలరించడం ఖాయమనిపిస్తుంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.