English | Telugu

'ఒక లైలా..' వసూళ్ళు రాబడుతోంది

నాగ చైతన్యై, పూజ హెగ్డే నటించిన 'ఒక లైలా కోసం' సినిమా వసూళ్ళను బాగానే రాబడుతోంది. శుక్ర, శని, ఆది వారాలకు కలిపి ఏడు కోట్ల వరకు షేర్ సాధించింది. ఈ లెక్కలు బట్టి చూస్తే లైలా చైతన్యకు అనుకున్న స్థాయి విజయాన్ని అందించిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సోమవారం తరువాత దీపావళి హాలీడేస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా హిట్ రెంజులో నిలుస్తోందని అంటున్నారు. ఇంకా శాటిలైట్ కూడా అమ్మలేదు..ఓవరాల్ గా ఈ సినిమా పది హేను పైన క్లోజింగ్ వుండే అవకాశం వుంది. ఏదేమైనా చైతన్య కి ఫాలోయింగ్ పెరుగుతోందనడానికి ఈ వసూళ్ళే కారణం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.