English | Telugu

రాజమౌళి షార్ట్ ఫిలిమ్

హుద్ హుద్ తుపాను విశాఖను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాను బాధితుల కోసం విరాళాల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తుపాను బాధితులను ఆదుకోవడానికి రాజీవ్ మీనన్ తో కలిసి ఓ వీడియోను రూపొందించారు. యువ హీరో రానానేపథ్య గాత్రం అందించారు. షేర్ ది స్పిరిట్ ఆఫ్ దీపావళి అన్నది టైటిల్. స్వామిరారాలో నటించిన బాల నటుడు, థర్టీ ఇయర్స్ పృధ్వీ తదితరులు నటించారు. దీపావళి ఖర్చు కొంత తగ్గించుకుని, దానిని తుపాను బాధితుల కోసం సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు ఇవ్వమనే సందేశం ఈ సినిమా కాన్సెప్ట్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.