English | Telugu

ఓజీ ట్రైల‌ర్‌పై మెగా హీరో ఊహించని రివ్యూ!

అందరూ ఎంతగానో ఎదురుచూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ ట్రైలర్ విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇలా కదా మేము పవర్ స్టార్ ని చూడాలనుకుంది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్‌ను వీక్షించిన పవన్ కళ్యాణ్ మేనల్లుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. (They Call Him OG)

"మేం ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయల్దేరింది. నాతో సహా ప్రతీ అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తి పరిచిన సుజీత్ గారికి థాంక్స్. ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. నా ప్రియ మిత్రుడు తమన్ ఇచ్చిన బీజీఎం అయితే నిజంగానే ఫైర్ స్ట్రామ్. నా హీరో, నా గురువు పవన్ కళ్యాణ్ మామయ్య ప్రతీ ఫ్రేమ్‌లో అద్భుతంగా కనిపించారు. స్వాగ్, స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కావు అన్నట్టుగా ఉంది. ఓజీని మనమంతా కలిసి సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే" అంటూ సాయి తేజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. (OG Trailer)

సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి. ఈమధ్య కాలంలో ఏ సినిమాపై లేనంతగా 'ఓజీ'పై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.