English | Telugu
రకుల్‌కు బంపర్ ఆఫర్
Updated : Jan 6, 2015
రకుల్ ప్రీత్ సింగ్' ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 2014లో వరుస సినిమాలు చేసి ఫేమస్ అయిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఈ యేడాది వరుస ఆఫర్లు దక్కించుకొ౦టుంది. ప్రస్తుతం రామ్ సరసన 'పండుగ చేస్కో', రవితేజ సరసన కిక్ 2 లో నటిస్తున్న ఈ భామకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ సినిమాలో రకుల్ ప్రీతిసింగ్‌ని హీరోయిన్ తీసుకున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇప్పటికే స్టోరీ కూడా పూర్తి కావడంతో, నటీనటుల ఎంపిక మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్’ రిలీజ్ కాగానే సుకుమార్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ ఆఫర్ ను తలచుకుని ఈ బ్యూటీ తెగ మురిసిపోతుందట.