English | Telugu
శ్రేయా ఘోషల్ పెళ్ళి చేసుకుంది
Updated : Feb 6, 2015
ప్రముఖ బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్ పెళ్ళి చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్, ఫేస్‌బుక్‌ల ద్వార తెలియజేసింది. ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్యను వివాహం చేసుకు౦ది. బెంగాలీ సంప్రదాయ పద్ధతిలో ఈ వెడ్డింగ్ జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో ఈ వివాహం జరగడం విశేషం. ఈ సందర్భంగా శ్రేయా 'నా జీవితంలో నేను ప్రేమిస్తున్న వ్యక్తిని వివాహం చేసుకున్నా. మీ ఆశీస్సులు మా ఇద్దరికి కావాలంటూ' కోరింది. హిప్కాస్ అనే సంస్థకు శైలాదిత్య కో-ఫౌండర్.