English | Telugu
ఎన్టీఆర్ పాట.. పవన్ సినిమాలో??
Updated : Jan 6, 2015
గోపాల గోపాల ఆల్బమ్‌లో మూడే మూడు పాటలు వినిపించాయి. అందులో భాజే, భాజే.. బాగా పాపులర్ అవుతోంది. ఆడియో రిలీజ్ కంటే ముందుగానే ఈ పాటని అభిమానుల కోసం విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ ట్యూన్ గోపాల గోపాల కోసం కట్టింది కాదట. టెంపర్ కోసం చేసుకొన్న ట్యూన్ అట. అటు టెంపర్‌కీ, ఇటు గోపాల గోపాలకీ అనూప్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. గోపాల గోపాల కంటే ముందే టెంపర్ ట్యూన్లు సిద్దమయ్యాయి. అందులో భాజే భాజే ఒకటి. దానికి లిరిక్స్ కూడా రాయించుకొన్నాడట అనూప్. కానీ ఆ ట్యూన్ టెంపర్ కి సెట్ అవ్వకపోవడంతో పూరి పక్కన పెట్టేశాడు. గోపాల గోపాలలో సెట్యువేషన్ కుదరడంతో అదే ట్యూన్ ని లిరిక్స్ మార్చి వాడుకొన్నారట. ఆ పాటే పవన్‌కి విపరీతంగా నచ్చి.. అనూప్‌కి తన మరుసటి సినిమాలో అవకాశం ఇస్తానని ప్రకటించాడు పవన్. ఒకరు కాదన్న పాట.. మరో సినిమాలో హిట్టయిపోయి సంగీత దర్శకుడికి విపరీతమైన పేరు వచ్చేయడం విచిత్రంగా ఉంది కదూ.