English | Telugu

‘గోపాల గోపాల’ ఆడియో టాక్

టాలీవుడ్ ఇండస్ట్రీ అంచనాలన్నీ ప్రస్తుతం ‘గోపాల గోపాల’ సినిమా చుట్టూ తిరుగుతున్నాయి. ఇండస్ట్రీ క్లోజ్ ఫ్రెండ్స్ వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన మొదటి చిత్రం కావడంతో అంచనాలు భారీగా వున్నాయి. ఆదివారం రిలీజైన ఈ సినిమా ఆడియోలో మొత్తం మూడు పాటలున్నాయి. ఈ ఆడియోలో పవన్‌కి ఒక సోలో సాంగ్‌, వెంకటేష్‌కి ఒక డ్యూయట్‌ ఉంటాయని ఊహాగానాలు సాగాయి. కానీ ఆడియోలో అలాంటివేమీ లేవు. భజే భజే..’ పాట ఒక్కటే కాస్త ఊపునిచ్చే కమర్షియల్‌ సాంగ్‌ కాగా... మిగిలిన రెండు పాటలు సిట్యువేషనల్‌గా వచ్చే పాటలే. వినడానికి పాటలు ఓకే అనిపిస్తాయి కానీ సినిమాపై హైప్‌ తీసుకు రావడానికి కానీ, అంచనాలు పెంచుకోవడానికి కానీ అనూప్‌ సంగీతం దోహదపడదు. అయితే ఈ సినిమా ఏర్పడిన అంచనాలు బాక్సాఫీస్‌ వద్ద ఎంత పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్‌ అవుతాయనేదే తేలాల్సి ఉంది.