English | Telugu
దీపావళికి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్..!
Updated : Oct 8, 2014
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తాను తెరకెక్కిస్తున్న చిత్రం కోసం డైరెక్టర్ పూరిజగన్నాథ్ బాగా కష్టపడుతున్నారట. ఈ సినిమా షూటింగ్ మొదలైన తరువాత అనుకొని కారణాల వల్ల కొద్ది రోజులు గ్యాప్ వచ్చినా జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేస్తున్నాడు పూరి. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేస్తానని అంటున్నాడు. దాని కోసం పక్కగా వైజాగ్, గోవాలలో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ దీపావళి రోజున విడుదల చేసే సన్నాహాలులో వున్నారట. తొందరగా సినిమాలను పూర్తి చేయడంలో తనకి తిరుగులేదని పూరి ఇంకోసారి నిరూపించుకోనున్నాడు.