English | Telugu

ఎన్టీఆర్ సెట్ ఇంకా పూర్తి కాలేదు

మిర్చి,శ్రీమంతుడు సినిమాలతో ఊపు మీదున్న కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా జనతా గ్యారేజ్..ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఫిబ్రవరి 10 నుండి స్టార్ట్ చేద్దామనుకున్నారు మూవీ టీం..టైటిల్ గా పెట్టిన జనతా గ్యారేజ్,ఈ సినిమాలో చాలా కీలకం.కానీ ఆ సెట్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి 25 కు ఫస్ట్ షెడ్యూల్ పోస్ట్ పోన్ అయిందని సమాచారం. కొరటాల శివ మరిన్ని మార్పులు చేర్పులతో,సెట్ పై ప్రత్యేక శ్రద్ధ సారిస్తున్నారు.ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఈ సెట్ ను నిర్మిస్తున్నారు. సెట్ నిజమైన గ్యారేజ్ లా కనిపించాలనేది కొరటాల ప్లాన్..షూటింగ్ లేట్ గా స్టార్ట్ అయినా, మిగిలిన షెడ్యూల్స్ లో వేగం పెంచి, ఆగస్ట్ 12 వ తారీఖున సినిమాను రిలీజ్ చేయడం కన్ఫామ్ అని మూవీ టీం చెబుతున్నారు..మోహన్ లాల్, ఉన్ని కృష్ణన్ కీలక పాత్రలు పోషిస్తున్న జనతా గ్యారేజ్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు..

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.