English | Telugu

ప్రియాంకకు ఆ రాత్రి మరపురాని రాత్రి

అమెరికన్ షో ' క్వాంటికో ' తో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి చేరుకున్న ప్రియాంక చోప్రా తాజాగా మరో జాక్ పాట్ కొట్టింది..ఫిబ్రవరి 28న కాలీఫోర్నియాలో జరగబోయే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్లలో స్టీవ్ క్యారెల్, జారెడ్ లీటో,జూలియన్ మూర్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో ఆస్కార్స్ స్టేజ్ ను షేర్ చేసుకుంటోంది..కాగా, ఉత్తమ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో, బాలీవుడ్ ' కోర్ట్ ' సినిమా షార్ట్ లిస్ట్ అయినా, ఆఖరి ఐదింటిలో చోటు దక్కించుకోలేకపోయింది.దాంతో ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ లో ఉన్న ఏకైక ఇండియన్ లింక్ ప్రియాంక మాత్రమే. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ కు ప్ర్రెజంటర్ గా ఎంపికవడంతో, ప్రియాంకకు ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన జీవితంలోనే ఫిబ్రవరి 28 అత్యంత క్రేజీయస్ట్ నైట్ కాబోతోందని ట్విట్టర్లో తన ఫీలింగ్స్ ను షేర్ చేసుకుంది ప్రియాంక.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.