English | Telugu

విశిష్ట శైలితో యన్ టి ఆర్ పెళ్ళి శుభలేఖ

విశిష్ట శైలితో యన్ టి ఆర్ పెళ్ళి శుభలేఖ ఉంది. వివరాల్లోకి వెళితే యువ హీరో జూనియర్ యన్ టి ఆర్ మ్యారేజ్ నార్నే శ్రీనివాసరావు కుమార్తె కుమారి లక్ష్మీ ప్రణీతతో "మే" నెల 5 వ తేదీ తెల్లవారు ఝామున 2 గంటల 14 నిమిషాలకు (తెల్లవారితే శుక్రవారం), హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో జరుగుతుంది. ఈ వివాహానికి సంబంధించిన శుభలేక సాంప్రదాయ బద్ధంగా, పూర్వీకులను గౌరవించే శైలితో ఉండటం విశేషం.


ఈ శుభలేఖ మొత్తం ఆరు పేజీలుంది. తొలి పేజీలో పెద్ద యన్ టి ఆర్ గారి తాతగారైన నందమూరి పెదరామస్వామి ఫొటో ముద్రించబడి ఉంటే రెండవ పేజీలో పెద్ద యన్ టి ఆర్ తలిదండ్రుల ఫొటో, ఆ తర్వాత యన్ టి ఆర్, బసవరామ తారకం ల ఫొటో ముద్రించబడి ఉండగా, నాలుగవ పేజీలో "విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రం" అంటూ యన్ టి ఆర్ కొడుకులూ,కోడళ్ళూ, కూతుర్లూ, అల్లుళ్ళ పేర్లు ముద్రించబడి ఉన్నాయి. అయిదవ పేజీలో పెళ్ళి ముహూర్తం విశేఆషాలు ముద్రించబడి ఉన్నాయి.


ఈ శుభలేఖలో ఎక్కడా పెళ్ళి కొడుకు యన్ టి ఆర్ ఫొటో గానీ, పెళ్ళి కూతురు ఫొటో గానీ లేక పోవటం విశేషం. ఈ శుభలేఖతో పాటు కార్ పాస్ మరియూ పార్కింగ్ గురించిన వివరాలున్నాయి. మొత్తానికి తన కుటుంబం అన్నా, ఆ కుటుంబంలోని పెద్దలన్నా తనకున్న గౌరవమర్యాదలను జూనియర్ యన్ టి ఆర్ ఇలా ప్రదర్శించటం అతని అభిమానులందరికీ ఆనందం కలిగించింది.

యన్ టి ఆర్ పెళ్ళికి అనేకమంది ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఆహ్వానితుల్లో ఉంటారు గనుక చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేస్తున్నారట. ఇక నందమూరి అభిమానులు, యువరత్న నందమూరి బాలకృష్ణ అభిమానులు జూనియర్ యన్ టి ఆర్ అభిమానుల సంగతి చెప్పక్కర్లేదు కదా.

I

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.