English | Telugu

ఎన్టీఆర్ అంటే లెక్కే లేదా?

కావాల‌ని మ‌రీ కొర‌టాల శివ‌ని కోరుకొన్నాడు ఎన్టీఆర్‌. శ్రీ‌మంతుడు లాంటి సూప‌ర్ హిట్ త‌ర‌వాత కొర‌టాల రేంజు అమాంతం పెరిగిపోయింది. మ‌రోవైపు... ఎన్టీఆర్‌కి ఓ అస‌లు సిస‌లైన హిట్టు ప‌డాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది. అందుకే కొర‌టాల‌ని ఏరికోరి మ‌రి... ఎంచుకొన్నాడు. `నాతో ఓ సినిమా చేయాల్సిందే..` అంటూ కొర‌టాల చుట్టూ తిరిగాడు. `ద‌స‌రాకి సినిమా ప్రారంభం కావాల్సిందే`అని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ కూర్చుకొన్నాడు. అందుకే కొర‌టాల ఇప్పుడు ఎన్టీఆర్ నెత్తికెక్కి కూర్చున్నాడు.

ఎన్టీఆర్ మాట‌ల్ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ కోడై కూస్తోంది. టైటిల్ ద‌గ్గ‌ర నుంచి అన్ని త‌న ఇష్ట ప్ర‌కార‌మే న‌డిపిస్తున్నాడ‌ట కొర‌టాల‌. హీరోయిన్ల ఎంపిక‌లోనూ కొర‌టాల‌దే ఫైన‌ల్ డిసీజ‌న్ అట‌. ఈ విష‌యంలో ఎన్టీఆర్‌ది ప్రేక్ష‌క‌పాత్రే అని తెలుస్తోంది. ఎన్టీఆర్ `శ్రుతిహాస‌న్ కావాలి` అని అడిగితే.. `శ్రుతితో ఆల్రెడీ వ‌ర్క్ చేశాను.. ఈ క‌థ‌కు ఫ్రెష్ హీరోయిన్లు కావాలి` అంటూ బాలీవుడ్ బాట ప‌ట్టాడ‌ట కొర‌టాల‌. అక్క‌డ్నుంచి ప‌రిణీతి చోప్రాని దిగుమ‌తి చేయ‌బోతున్నట్టు టాక్‌. అంతే కాదు... ఈ సినిమాలోని ఓ కీల‌క పాత్ర కోసం హ‌రికృష్ణ ని తీసుకొంటే బాగుంటుంద‌ని ఎన్టీఆర్ ఆలోచ‌న‌. తండ్రితో న‌టిస్తే.. నంద‌మూరి అభిమానుల్ని మ‌రింత‌గా ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని, త‌మ ఫ్యామిలీ బాండింగ్ కూడా బాగుంటుంద‌ని ఎన్టీఆర్ ఆలోచ‌న‌.

అయితే ఈ ఐడియా కూడా కొర‌టాల‌కు న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. అందుకే మోహ‌న్ లాల్‌ని రంగంలోకి దింపాడ‌ట‌. హ‌రికృష్ణ కంటే మోహ‌న్ లాల్ బెట‌ర్‌.. క‌మ‌ర్సియ‌ల్‌గానూ బాగా వ‌ర్క‌వుట్ అవుద్ది అంటూ.. ఎన్టీఆర్ ని ఒప్పించాడ‌ట‌. అలా ఎన్టీఆర్ ఎడ్డెం అంటే కొర‌టాల తెడ్డెం అంటున్నాడ‌ని.. ఎన్టీఆర్ మాటంటేనే అస్స‌లు కేర్ చేయ‌డం లేద‌ని... కొర‌టాల సొంత ప్ర‌తిభ చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని, ఎన్టీఆర్ కూడా ఏం చేయ‌లేక మౌనంగా అన్నీ భ‌రిస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అదే.. ఎన్టీఆర్ చేతిలో ఓ బంప‌ర్ హిట్టుంటేనా... ఇవ‌న్నీ భ‌రించాల్సివ‌చ్చేదా అనేది అభిమానుల ఆవేద‌న‌.. కరెక్టే క‌దూ.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.