English | Telugu

ప్ర‌కాష్‌రాజా..? అయితే తొక్కేయ్యండి!

ఒక‌ప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు పాత్ర‌ల్లో మ‌కుటం లేని మ‌హారాజులా వెలిగిపోయాడు ప్ర‌కాష్‌రాజ్‌. ఏ సినిమా చూసినా ప్ర‌తినాయ‌కుడు త‌నే. పెద్ద హీరోలంతా ప్ర‌కాష్ రాజ్‌నే కావాల‌నే వారు. ఆఖ‌రికి మంచి నాన్న పాత్ర‌ల‌కూ కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచాడు. త‌న టాలెంట్‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొంటూ.. సినిమాల్ని నిల‌బెడితే.. త‌న బిహేవియ‌ర్‌తో సెట్లో అస‌హ‌నానికి గురి చేసేవాడు. ప్ర‌కాష్ రాజ్ పారితోషికం ఎప్పుడూ ఆకాశ‌పు అంచుల వ‌ర‌కూ ఉండేది. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా `ప్ర‌కాష్‌రాజ్ డిమాండ్‌` చూసి త‌ట్టుకొనేవారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారింది. ప్ర‌కాష్ రాజ్ కి ప్ర‌త్యామ్నాయాలు పెరిగాయి.

జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర ప్ర‌సాద్‌,రావు ర‌మేష్ లాంటి వాళ్లు దిగ‌బ‌డ్డారు. మిర్చి ప్ర‌భాక‌ర్‌లాంటివాళ్లు అందుబాటులో ఉన్నారు. ప్ర‌కాష్‌రాజ్ పారితోషికం రోజుకి ఐదారు ల‌క్ష‌లైతే... మిర్చి ప్ర‌భాక‌ర్ ల‌క్ష‌కే అందుబాటులో ఉన్నాడు. దానికి తోడు.. తెర‌పై కాస్త కొత్త‌ద‌నం క‌నిపిస్తుంది. ప్ర‌కాష్‌రాజ్ స్థానాన్ని భ‌ర్తీ చేసేవాళ్లు ఉండ‌డంతో.. ద‌ర్శ‌కులిప్పుడు రెచ్చిపోతున్నారు. బ‌డా డైరెక్ట‌ర్లంతా ప్ర‌కాష్‌రాజ్‌నిప‌క్క‌న పెట్టాల‌ని డిసైడ‌యిన‌ట్టు... విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. నిర్మాత‌లు కూడా అందుకు స‌రే అంటున్నార‌ట‌. వీలైనంత వ‌ర‌కూ ప్ర‌కాష్‌రాజ్ లేకుండానే సినిమా పూర్తిచేద్దాం మ‌రీ త‌ప్ప‌ద‌నుకొంటే అప్పుడు తీసుకొందాం అనుకొంటున్నార‌ట‌.

గ‌తంలో ప్ర‌కాష్‌రాజ్ చేతిలో కాస్త దెబ్బ‌తిన్న‌వాళ్ల‌యితే... `కాస్త రెమ్యున‌రేష‌న్ ఎక్కువైనా జ‌గ‌ప‌తిబాబుని తీసుకొందాం..` అంటున్నార‌ట‌. దాంతో ప్ర‌కాష్‌రాజ్ కెరీర్ గ్రాఫ్ ప్ర‌స్తుతానికి అమాంతం ప‌డిపోయిన‌ట్టు టాక్‌. ఇంకో ఇద్ద‌రు ముగ్గురు నికార్స‌యిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు దిగ‌బడితే.. ప్ర‌కాష్‌రాజ్ ప‌రిస్థితి ఏమైపోతుందో అనిపిస్తుంది. మొత్తానికి ద‌ర్శ‌కులంతా క‌ల‌సి ప్ర‌కాష్‌రాజ్‌కి చెక్ పెట్ట‌డం మొద‌లెట్టారు. మ‌రి ఈ ప‌ద్మ‌వ్యూహంలోంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .