English | Telugu

‘టెంపర్‌’ రిలీజ్ డేట్ ఎప్పుడూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్‌’ పొంగల్‌ రేస్‌లోంచి తప్పుకున్నట్టే. ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా వాయిదా పడడంతో మళ్ళీ ఈ సినిమా తిరిగి పట్టాలేక్కెదేప్పుడు? ఈ సినిమా రిలీజెప్పుడు అనే విషయాలపై క్లారిటీరాలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సంక్రాంతి మిస్‌ అవడంతో మళ్లీ మంచి సీజన్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. సంక్రాంతి తర్వాత తెలుగు సినిమాలకి బెస్ట్‌ సీజన్‌ సమ్మర్‌ కనుక అంత వరకు ‘టెంపర్‌’ రాకపోవచ్చునట. సమ్మర్‌లో ఫస్ట్‌ బిగ్‌ రిలీజ్‌గా ‘టెంపర్‌’ రిలీజ్‌ కావచ్చునని సమాచారం. మార్చి 27న ‘టెంపర్‌’ రిలీజ్‌ అయ్యే అవకాశాలే ఎక్కువని, అంతకుముందు ఎక్స్‌పెక్ట్‌ చేయక్కర్లేదని అంటున్నాయి. దీంతో సంక్రాంతికి ‘గోపాల గోపాల’ మాత్రమే కన్‌ఫర్మ్‌ అయింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.