English | Telugu

నా కంటే పదహారు సంవత్సరాలు చిన్న.. అసలు నిజం ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ ఓదార్పు 

స్టార్ హీరోయిన్ 'రష్మిక'(Rashmika Mandanna)ఇటీవల 'కుబేర'(Kuberaa)తో తన కెరీర్ లో మరో విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే రీసెంట్ గా 'మైసా'(Mysaa)అనే విభిన్నకథతో తెరకెక్కే లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా రిలీజైన రష్మిక లుక్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో 'మైసా' పై అంచనాలని పెంచేసిందని చెప్పవచ్చు. మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్' శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం రష్మిక, దీక్షిత్ శెట్టి పై ఒక సాంగ్ ని చిత్రీకరించడం జరిగింది.

రీసెంట్ గా రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాకు పదమూడు సంవత్సరాలు వయసుగల చెల్లి ఉంది. తనకి నాకు పదహారేళ్లు తేడా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం నా కెరీర్ ని ప్రారంభించినప్పట్నుంచి నేను ఆమెని సరిగా చూసుకోలేకపోతున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ విషయం గుర్తు చేసుకుంటే చాలా బాధేస్తుంది. ఇంటికి వెళ్లి సంవత్సరంన్నర అవుతుంది. దీంతో ప్రస్తుతం కన్నీళ్లతో నా వారాంతపు సెలవు కోసం ఏడుస్తున్నాను. స్నేహితులు విహారయాత్రకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసేవారు. దాంతో వాళ్ళతో ఎంతో సరదాగా ఎంజాయ్ చేసే దాన్ని. కానీ బిజీ వల్ల నేను రానని తెలిసి ఫోన్ చెయ్యడం కూడా మానేశారు. వృత్తిపరమైన జీవితం బాగుండాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చెయ్యాలని, వ్యక్తిగత జీవితం బాగుండాలంటే వృత్తి పరమైన జీవితం సంతృప్తి ని ఇవ్వదని మా అమ్మ నాతో చెప్పిందని రష్మిక తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది.

రష్మిక ఖాతాలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న 'థామ'(Thama)అనే హర్రర్, రొమాంటిక్ కామెడీ మూవీ ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana)హీరోగా చేస్తుండగా ఆదిత్య సర్పోటీదార్ దర్శకుడిగా వ్యవరిస్తున్నాడు. చావా, యానిమల్, పుష్ప పార్ట్ 1 , పార్ట్ 2 తో రష్మిక బాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.


అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.