English | Telugu

కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనం కేసులో సరికొత్త నిజాలు

మంచు విష్ణు(Vishnu), మోహన్ బాబు(Mohanbabu)ప్రెస్టేజియస్ట్ మూవీ 'కన్నప్ప'(Kannappa). 'పరమేశ్వరుడి' పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. 24ఫ్రేమ్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్ పై విష్ణు,మోహన్ బాబు లే నిర్మిస్తుండగా జూన్ 27 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది. కొన్ని రోజుల క్రితం ముంబై నుంచి వచ్చిన కన్నప్ప కి సంబంధించిన 'హార్డ్ డిస్క్' ని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీలో పని చేసే రఘు, చరిత అనే ఇద్దరు తీసుకొని పారిపోయారు. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదయ్యింది.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతు 'ముంబైలో ఉన్న నాలుగు విఎఫ్ఎక్స్ కంపెనీలు కన్నప్ప కోసం పని చేస్తున్నాయి. వాటిల్లో ఒక కంపెనీ ఆన్ లైన్ లో కొంత భాగాన్ని పంపింది. క్లారిటీ
లేకపోవడంతో రెండో సారి అప్ లోడ్ చేసి, ముందు జాగ్రత్త కోసం ఒక హార్డ్ డిస్క్ ని పంపింది. నాన్నగారి ముగ్గురి పిల్లలకి సంబంధించి ఎలాంటి పార్సిల్ వచ్చినా కూడా, ఇప్పుడు వెళ్లిన అడ్రస్స్ కే వెళ్తుంది.
మేనేజర్లు ఎవరి పేర్లు ఉంటే వాళ్ళకి అందచేస్తారు. కన్నప్ప పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే అమ్మాయికి వ్వమని చెప్పాడంట. ఆ తర్వాత ఆమె తో పాటు ఇద్దరు కనపడకుండా
వెళ్లిపోయారు. మాకు తెలిసిన నిజం ఏంటంటే ఆ ఇద్దరు మనోజ్ తో ఉంటారు. ఇప్పటికి హార్డ్ డిస్క్ మనోజ్ దగ్గరే ఉంది. మధ్యవర్తి ద్వారా కూడా పంపించినా ఇవ్వనున్నారు.పోలీసులకి అన్ని విషయాలు చెప్పాం కాబట్టి వాళ్లే ఎంక్వరీ చేసి తేలుస్తారు. నా చేతికైతే ఇంకా హార్డ్ డిస్క్ రాలేదు. పాస్ వర్డ్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కాదు. విఎఫ్ ఎక్స్ కి భారీ ఖర్చు అయ్యింది. ఒక ఖరీదైన తప్పు చెయ్యడం వల్ల 15 కోట్లు లాస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.

కన్నప్ప లో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal)అక్షయ్ కుమార్(Akshay Kumar)కాజల్, ప్రీతీ ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తుండగా ముకేశ్ కుమార్
సింగ్(Mukesh Kumar Singh)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. స్టీఫెన్ సంగీతాన్ని అందించగా ఇప్పుడికే విడుదలైన పాటలు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కన్నప్ప పై అంచనాలు పెంచాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.