English | Telugu

కమల్ హాసన్ దురదృష్టవంతుడు.. ఆ ఇద్దరు ఎందుకు చెయ్యలేదు!  

విశ్వకథానాయకుడు 'కమల్ హాసన్'(Kamal Haasan)ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం(Mani ratnam)కాంబోలో తెరకెక్కిన మూవీ 'థగ్ లైఫ్'(Thug Life).త్రిష(Trisha),శింబు(Simbu),అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, నాజర్, తనికెళ్ళభరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో జూన్ 5 న విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం అన్ని భాషల్లోను ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా నిన్న తెలుగు ప్రేక్షకులతో సినిమాకి సంబంధించిన పలు విషయాలతో పాటు తమ కెరీర్ కి సంబంధించిన విషయాలని పంచుకుంది.

అందులో భాగంగా కమల్ హాసన్ మలయాళ చిత్ర పరిశ్రమలో అవకాశాల గురించి మాట్లాడుతు 'నా కంపెనీ ని నడపడానికి నేను ఇప్పటికీ సంపాదన వెంట పడుతున్నాను. నిజానికి నా దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ డబ్బు అవసరం లేదు. కానీ నా సినిమాలు కోసం మరింత డబ్బు నాకు కావాలి. అందుకే ఆర్థికంగా బలపడటం కోసం మలయాళ చిత్ర పరిశ్రమని ఎంచుకున్నాను. కాకపోతే ఎం టి వాసుదేవన్ నాయర్(Mt vasudevan Nair)మృణాల్ సేన్(mrinal sen)వంటి దిగ్గజాలతో సినిమాలు చేయలేకపోయినందుకు మాత్రం దురదృష్టవంతుడ్ని అని చెప్పుకొచ్చాడు.

1962 వ సంవత్సరంలో కె ఎస్ సేతుమాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన కణ్ణుమ్ కారులమ్ అనే చిత్రంతో కమల్ మలయాళ చిత్ర పరిశ్రమలో బాలనటుడిగా అడుగుపెట్టాడు. ఆ తర్వాత సోలో హీరోగా 1974 లో 'కన్యాకుమారి' అనే మూవీతో పాటు మొత్తం ఇరవై నాలుగు సినిమాల దాకా చేసాడు. కాకపోతే స్టార్ గా పెద్దగా పేరు సంపాదించలేదు. చివరగా 1989 లో చాణక్య అనే సినిమాలో నటించాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.