English | Telugu

అవతార్ 2 రీ రిలీజ్ డేట్ పై టెన్షన్.. కండిషన్స్ తెలిసి షాక్ 

ప్రపంచ సినీ పితామహుడిగా అభిమానుల చేత కీర్తించబడే దర్శకుడు జేమ్స్ కేమరూన్(James Cameron). ఆయన దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు ప్రపంచ సినీ ప్రేమికులని ఎంతగానో అలరించడమే కాకుండా, విజువల్ గా కూడా ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసాయి. అలాంటి వాటిల్లో 'అవతార్(Avatar)సిరీస్' కూడా ఒకటి. ఇప్పటి వరకు రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫైర్ అండ్ ఆష్ గా తెరకెక్కుతున్న అవతార్ పార్ట్ 3 (Avatar part 3)ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, డిసెంబర్ 19 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఇక మేకర్స్ ఈ లోపు పార్ట్ 2(Avatar part 2)ని రీ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 3 న రీ రిలీజ్ చేస్తున్నట్టు అధికార ప్రకటన కూడా వారి నుంచి వచ్చింది. కాకపోతే వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందా, లేక కేవలం ఓవర్సీస్ మార్కెట్ లోనేనా అనేది వెల్లడి చెయ్యలేదు. పైగా ఒక్క వారం మాత్రమే లిమిటెడ్ ఎంగేజ్మెంట్ గా థియేటర్స్ లో ఉంటున్నట్టుగా కూడా ప్రకటించారు. మరి ఈ విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంటుందేమో చూడాలి.

ప్రస్తుతం చాలా చిత్రాలు రీ రిలీజ్ లో మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవతార్ పార్ట్ 2 రీ రిలీజ్ లో రికార్డు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుందని సినీ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. భార్య భర్తలైన జేక్ సల్లీ, నైతిరి తమ పిల్లలతో కలిసి ఓమాటికా తెగకు నాయకత్వం వహిస్తు, పండోరా గ్రహంపై ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే భూమి నుండి వచ్చిన మానవులు పండోరా గ్రహంపైకి వచ్చి వారిని ఇబ్బందులకి గురి చేస్తారు. ఈ క్రమంలో జేక్ సల్లీ, నైతిరి కుటుంబంతో పాటు,తమ కొత్త ప్రపంచాన్ని ఏ విధంగా కాపాడుకున్నారనే కథాంశంతో పార్ట్ 2 తెరకెక్కింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.