English | Telugu

విజయ్ సినిమాలో విలన్ గా రాజశేఖర్!

టాలీవుడ్ లో పలువురు సీనియర్ హీరోలు విలన్ గా మారుతున్నారు. ఇప్పటికే జగపతిబాబు, శ్రీకాంత్ వంటి హీరోలు.. ప్రతినాయక పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో రాజశేఖర్ (Rajasekhar) కూడా చేరబోతున్నారని తెలుస్తోంది. గతంలో ఎన్నో పవర్ ఫుల్ రోల్స్ పోషించి యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్.. కొన్నేళ్లుగా హీరోగా వెనకబడ్డారనే చెప్పాలి. దీంతో ఆయన విలన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని వినికిడి. విజయ్ దేవరకొండ సినిమాలో రాజశేఖర్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారని సమాచారం.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న 'కింగ్‌డమ్'తో త్వరలో ప్రేక్షకుల పలకరించనున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఆ తర్వాత దర్శకులు రాహుల్ సాంకృత్యాయన్, రవికిరణ్ కోలాతో సినిమాలు చేయనున్నాడు. వీటిలో రవికిరణ్ ప్రాజెక్ట్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి 'రౌడీ జ‌నార్థ‌న్‌' అనే టైటిల్ ని లాక్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. 'రౌడీ జ‌నార్థ‌న్‌'లో విలన్ గా రాజశేఖర్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజ‌శేఖ‌ర్ తో ఫొటో షూట్ ను కూడా పూర్తి చేశారట. ఇందులో రాజ‌శేఖ‌ర్ క్యారెక్ట‌రైజేష‌న్, గెట‌ప్ కొత్తగా ఉంటాయట. ఆ పాత్రను రవికిరణ్ డిజైన్ చేసిన తీరు అదిరిపోయిందని అంటున్నారు. 'రౌడీ జ‌నార్థ‌న్‌' తర్వాత రాజశేఖర్ ఒక్కసారిగా క్రేజీ విలన్ గా మారిపోవడం ఖాయమని చెబుతున్నారు.

నిజానికి రాజశేఖర్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. బాలకృష్ణ, రామ్ వంటి హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా కనిపించనున్నారని ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. ఆ మధ్య నితిన్ హీరోగా నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో మెరవగా.. ఆ సినిమా పరాజయంపాలైంది. రాజశేఖర్ పాత్రకు కూడా పెద్దగా పేరు రాలేదు. అయితే ఆయన యాంగ్రీ మ్యాన్ ఇమేజ్ కి తగ్గ పవర్ ఫుల్ విలన్ రోల్ 'రౌడీ జ‌నార్థ‌న్‌'లో పోషిస్తున్నారని, ఈ సినిమాతో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.