English | Telugu

అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతికి వచ్చేస్తున్న బాలయ్య.. ఇది కన్‌ఫర్మ్‌!

గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించిన భగవంత్‌ కేసరి తర్వాత ఇమ్మీడియట్‌గా బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న 109వ సినిమా సెట్స్‌కి వెళ్లిపోయారు బాలకృష్ణ. నిర్విరామంగా షూటింగ్‌ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ మేకర్స్‌ నుంచి రాలేదు. తమ హీరో కొత్త సినిమా అప్‌డేట్స్‌ తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని గతంలోనే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో సంక్రాంతికి ఎలా రిలీజ్‌ అవుతుంది అంటున్నారు అభిమానులు. వారు అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. బాలకృష్ణ 109 చిత్రం సంక్రాంతికి రిలీజ్‌ అవ్వదని, బాలకృష్ణకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందనే వార్త ప్రచారంలోకి వచ్చేసింది. అయితే సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఎందుకంటే గత వారం రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ, బాబీ డియోల్‌ తలపడే యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అంతేకాదు, సినిమాలో ఎంతో కీలకంగా చెప్పుకునే 25 నిమిషాల ఎపిసోడ్‌ సినిమాకే హైలైట్‌ కాబోతోందని తెలుస్తోంది. సంక్రాంతికి బాలకృష్ణ 109 రిలీజ్‌ అవ్వదు అని ప్రచారం చేస్తున్నవారికి సమాధానంగా నవంబర్‌ 15 నుంచి సినిమా ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ మేకర్స్‌. సినిమాకి సంబంధించిన టీజర్‌ను నవంబర్‌ 15న విడుదల చేయబోతున్నారు. ఆ టీజర్‌లోనేటైటిల్‌ను రివీల్‌ చేస్తారు. ఈ సినిమాకు ‘డాకు మహరాజ్‌’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ప్రచారంలో ఉన్న ఆ టైటిల్‌నే ఫిక్స్‌ చేస్తున్నారని సమాచారం. నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి ఎంతో సెంటిమెంట్‌. దానితోనే ఎన్నో ఘనవిజయాలు సాధించారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.