English | Telugu
దసరాకు రానున్న "అనామిక"
Updated : Jul 10, 2013
నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "అనామిక". శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయనున్నారు.
హిందీలో విద్యాబాలన్ నటించిన "కహానీ" చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో "అనామిక" పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించింది. అయితే ఒక్క సన్నివేశంలో కూడా విద్యాబాలన్ ల నటించకుండా నా స్టైల్లో నేను నా పాత్రకు న్యాయం చేస్తానంటోంది హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది.