English | Telugu
జూనియర్ డైరెక్టర్ తో నార్నే నితిన్ మూవీ!
Updated : Oct 12, 2025
మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ వంటి హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నార్నే నితిన్. ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న నితిన్.. తనని ఎలివేట్ వేసే మాస్ కథలు కంటే కూడా, సింపుల్ మరియు ఎంటర్టైనింగ్ గా ఉండే కథలను ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. ఇక ఇప్పుడు నితిన్, తన నెక్స్ట్ మూవీ కోసం 'జూనియర్' డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది.
'మాయాబజార్ 2016'తో దర్శకుడిగా పరిచయమై ఆకట్టుకున్న రాధాకృష్ణ రెడ్డి.. ఈ ఏడాది గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటితో చేసిన 'జూనియర్'తో నిరాశపరిచాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్.. నార్నే నితిన్ తో ఓ ఎంటర్టైనర్ తీయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట.
నార్నే నితిన్ ఇటీవలే ఓ ఇంటి వాడయ్యాడు. శివాని తాళ్లూరితో ఆయన వివాహం జరిగింది. మరి పెళ్ళి తర్వాత నటిస్తున్న మొదటి సినిమా నితిన్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.