English | Telugu
రాజమౌళితో చేసేవాడిని కదా : నారా రోహిత్
Updated : Mar 10, 2016
ఇప్పుడున్న యువ హీరోల్లో వరసగా సినిమాలు చేస్తూ, ఒక ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు నారా రోహిత్. చేతిలో ఆరు, రెడీ గా మరో ఆరు. ప్రొడ్యూసర్ కు మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగు. ఇదీ నారా రోహిత్ కెరీర్ జోరు. తుంటరితో ఈ వారం వస్తున్న రోహిత్, మరో రెండు వారాల తర్వాత సావిత్రితో మళ్లీ థియేటర్లపై దాడికి రెడీగా ఉన్నాడు. అంటే ఆల్ మోస్ట్ తన సినిమాలు తనకే పోటీ అయ్యే పరిస్థితిలో రోహిత్ ఉన్నాడు.
తన పెదనాన్న ముఖ్యమంత్రి కావడం వల్లనే, రోహిత్ కు ఇన్ని సినిమాలు వస్తున్నాయనే అపవాదు తనపై ఉంది. ఒక వేళ్ల అదే నిజమైతే, నేను రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తోనే చేసేవాడిని కదా అంటూ సున్నితంగా సమాధానం చెబుతున్నాడీ నారావారబ్బాయి. ఈ రెండు సినిమాల తర్వాత, పండగలా వచ్చాడు, రాజా చెయి వేస్తే, అప్పట్లో ఒకడుండేవాడు అంటూ వరస సినిమాలు రోహిత్ కు లైన్ కట్టి ఉన్నాయి. రేపు రాబోయే తుంటరికి గుండెల్లో గోదారి, జోరు తీసిన కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించాడు. తమిళంలో చిన్న సినిమాగా వచ్చి 55 కోట్లు కొల్లగొట్టిన మాన్ కరాటే కు ఇది రీమేక్ కావడం విశేషం.