English | Telugu

మా పవనన్న స్వాగ్ అంటే ఇదే.. మంత్రి నారా లోకేష్ ట్వీట్  

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan) రేపు పీరియాడిక్ మూవీ 'హరిహరవీరమల్లు' తో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు రాత్రి 9 గంటలకి ప్రత్యేక 'షో' కూడా ప్రదర్శిస్తుండటంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో (సినీ) సందడి వాతావరణం నెలకొని ఉంది.

వీరమల్లు రిలీజ్ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఐటి, మానవ వనరుల శాఖ మంత్రి 'నారా లోకేష్' ఎక్స్ వేదికగా స్పందిస్తు 'మా పవన్ అన్న మూవీ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల లాగానే నేను కూడా వీరమల్లు ని ఎప్పుడెప్ప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, స్వాగ్ నాకు చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్సు తో 'వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటు ట్వీట్ చేసాడు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ పై సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం వీరమల్లు ని భారీ వ్యయంతో నిర్మించగా, అత్యంత ప్రతిభావంతమైన టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేసారు. విభిన్న చిత్రాలు దర్శకుడు క్రిష్ కొంత భాగానికి దర్శకత్వం వహించగా మరో దర్శకుడు జ్యోతికృష్ణ మిగతా భాగాన్ని పూర్తి చేసాడు. ఆస్కార్ విన్నర్ 'కీరవాణి' తన అద్భుతమైన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వీరమల్లు కి సరికొత్త రూపాన్ని తీసుకొచ్చాడు. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్స్ లో చెప్తు వస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్, బాబీడియోల్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, రఘుబాబు, అనసూయ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.