English | Telugu
నాన్నకు ప్రేమతో సెన్సార్ రిపోర్ట్.. సూపర్ హిట్టట
Updated : Jan 6, 2016
నాన్నకు ప్రేమతో సెన్సార్ రిపోర్టు వచ్చేసింది.
అదేంటి?? ఈ సినిమా సెన్సార్ కెప్పుడెళ్లింది? అనుకొంటున్నారా? ఇక్కడి సెన్సార్ కాదండీ. ఈ సినిమాకి ఆల్రెడీ దుబాయ్ లో సెన్సార్ జరిగిపోయిందట. అక్కడి సెన్సార్ సభ్యురాలు కైరా సంధు ఈ సినిమాపై రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. ఎన్టీఆర్ ఇది వరకెప్పుడూ లేనంత స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. తప్పకుండా ఈసినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని డిక్లేర్ చేసేసింది. కైరా ఇది వరకు శ్రీమంతుడు సినిమాకీ అందరికంటే ముందు ఇలానే జోస్యం చెప్పింది. ఆ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే బ్లాక్ బ్లస్టర్ హిట్ అవుతుందని అందరికంటే ముందే చెప్పేసింది. అనుకొన్నట్టుగానే ఆ సినిమా తెగ ఆడేసింది. ఇప్పుడు కైరా జోస్యం నాన్నకు ప్రేమతో విషయంలోనూ నిజం అవుతుందన్నది అభిమానుల నమ్మకం. సో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్.. పండగ చేసుకోండి...