English | Telugu

49లోకి అడుగుపెట్టిన 'మొజార్ట్ ఆఫ్ మద్రాస్'

ఇండియా నుంచి ఆల్ టైం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న ఎ.ఆర్ రెహమాన్ ఈ రోజు తన 49వ పుట్టిన రోజు వేడుకని జరుపుకోనున్నాడు. మణిరత్నం తీసిన ‘రోజా’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై తన మ్యూజిక్ తో అందరి ప్రశంశలు అందుకున్నాడు. వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ లో డిప్లమా చేసిన రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించడమే కాకుండా అద్భుతంగా పాటలు పాడగలడు. ఒకవైపు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేస్తూనే మరోవైపు సూపర్ హిట్ ఆల్బమ్స్ ని, మ్యూజిక్ వీడియోలను రూపొందించి మెప్పించాడు.

‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్’, ‘ఇసై పుయల్’గా ముద్దుగా పిలవబడే రెహమాన్ ఎన్నో అవార్డులను,రివార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు 4 నేషనల్ అవార్డులు,6 తమిళ నాడు స్టేట్ అవార్డ్స్,15 ఫిలింఫేర్ అవార్డ్స్ మరియు 13 సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు భారతప్రభుత్వం అందించే ‘పద్మశ్రీ’ ని,అలాగే 2009 లో ‘స్లగ్ డాగ్ మిలినియర్ ‘మూవీ కి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

తమిళ సినిమాలతో మొదలైన రెహమాన్ సంగీత ప్రయాణం అంతర్జాతీయ సినిమాలకు సంగీతం అందించే అవకాశాన్ని అతితక్కువ వ్యవధిలోనే దక్కించుకున్నాడు. ఇక తెలుగులో సూపర్ పోలీస్, నాని, ఏమాయ చేశావే,పులి వంటి సినిమాలకు సంగీతాన్ని అందించిన రెహమాన్ ఎక్కువగా తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం శంకర్-రజినీకాంత్ కాంబినేషన్ లో ‘చిట్టి 2.0’ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు రెహమాన్. అలాగే నిర్మాతగా సంగీత ప్రధానంగా ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు టాక్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే రెహమాన్ అందించనున్నాడట. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా వుండే రెహమాన్ తనవంతు బాధ్యతగా రెహమాన్ టీబీ వ్యాధి నిర్మూలనకు బ్రాండ్ అంబాసిడర్ గా,కొన్ని స్వచ్చంద సేవా సంస్థలకు అండగా నిలబడ్డాడు.

సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఏ.ఆర్.రెహమాన్ మరిన్ని మంచి సినిమాలకు సంగీతాన్ని అందించి, ఇలాగే ప్రేక్షకులను అలరిస్తూ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ తెలుగువన్.కామ్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.