English | Telugu

'నాన్నకు ప్రేమతో' ఆడియో హైలైట్స్

టాలీవుడ్ ఆడియో ఫంక్షన్ లకు బిన్నంగా నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ సాగింది. ఈ వేడుక అంతా దాదాపుగా దేవిశ్రీ చుట్టూనే తిరిగింది. తనకు తండ్రికి మధ్య ఉన్న అనుబంధాన్ని దేవిశ్రీ పంచుకున్నాడు. తను పరిచయం చేసిన సింగర్స్ చాలామందిని.. నాన్నే రిఫరెన్స్ చేశారని గుర్తు చేసుకున్నాడు. 'తోటి టెక్నీషియన్ వర్క్ ని అభినందించ గలిగినపుడే.. నువ్వు టెక్నీషియన్ గా ఎదుగుతావని' నాన్న చెప్పారని అన్నాడు దేవిశ్రీ.

తన తండ్రి చనిపోయాక ఆయన ఎమోషన్లోంచి ఈ కథ పుట్టిందని చెప్పడం.. సుక్కు ఎలాంటి స్థితిలో ఈ కథ రాశాడో ఎన్టీఆర్ చెప్పడం.. జనాల్ని కదిలించాయి. ఇక కళ్యాణ్ రామ్ కూడా తన తండ్రి హరికృష్ణ గొప్పదనం గురించి గొప్పగా మాట్లాడగా.. హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తన చిన్న కొడుక్కి పేరు పెట్టిన వైనం గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కు తండ్రి మీద ఉన్న ప్రేమ గురించి వినాయక్ ప్రస్తావించాడు. జగపతి కూడా తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ ను గుర్తు చేసుకుని.. ఆయన చివరి కోరిక ప్రకారం ‘జగపతి పిక్చర్స్’ బేనర్ మీద మళ్లీ సినిమాలు తీస్తానని చెప్పాడు. మొత్తానికి నాన్నకు ప్రేమతో ఆడియో చాలా ఎమోషనల్ గా సాగింది. టాలీవుడ్ ఆడియో ఫంక్షన్ లలో ఇదే ది బెస్ట్ ఆడియో ఫంక్షన్ అని కూడా చెప్పవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.