English | Telugu

100 కోట్లు కలెక్ట్‌ చేసిన ‘దసరా’ కంటే 100 రెట్లు బెటర్‌గా ‘నానిఓదెల2’!

నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు సుకుమార్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి మంచి అనుభవం సంపాదించిన శ్రీకాంత్‌ ఓదెల తొలి ప్రయత్నంగా నానితో ‘దసరా’ చిత్రాన్ని చేశారు. మొదటి చిత్రంతోనే తన టాలెంట్‌ ఏమిటో చూపించారు శ్రీకాంత్‌. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌గా ‘దసరా’ నిలిచింది. ఫుల్‌ రన్‌లో రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసి నాని కెరీర్‌లోనే హయ్యస్ట్‌ గ్రాసర్‌ అయ్యింది. ఇప్పటివరకు నానిని ఎవరూ చూపించని ఫుల్‌ మాస్‌ క్యారెక్టర్‌తో కమర్షియల్‌ సక్సెస్‌ సాధించడం అంటే మామూలు విషయం కాదు. గురువు సుకుమార్‌ దగ్గర నేర్చుకున్న ఎన్నో అంశాలను కూడగట్టి ‘దసరా’ చిత్రాన్ని ఎంతో వైవిధ్యంగా రూపొందించారు శ్రీకాంత్‌.

ఇప్పుడు నానితోనే తన రెండో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు శ్రీకాంత్‌. నాని 33వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్‌ వీడియోను రూపొందించే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్‌ ఎకౌంట్‌ ద్వారా తెలియజేశారు శ్రీకాంత్‌. ‘2023 మార్చి 7న నా దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమాకు లాస్ట్‌ కట్‌, షాట్‌ ఓకే చెప్పాను. 2024 సెప్టెంబరు 18న మళ్లీ షూటింగ్‌లో నా తాజా చిత్రం ‘నానిఓదెల2’ అనౌన్స్‌మెంట్‌ వీడియో కోసం యాక్షన్‌ చెబుతున్నాను. నా మొదటి సినిమా ‘దసరా’ విడుదలై 4 కోట్ల 84 లక్షల 70 వేల 400 సెకన్లు గడిచిపోయాయి. నా తొలి సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తూనే ప్రతి సెకను నా తదుపరి చిత్రం ది బెస్ట్‌ ఇవ్వడం మీదే దృష్టి పెట్టాను. ‘దసరా’ చిత్రాన్ని మించి వంద రెట్లు ‘నానిఓదెల2’ ద్వారా ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తానని మాట ఇస్తున్నాను’ అంటూ పోస్ట్‌ చేశారు శ్రీకాంత్‌ ఓదెల. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ప్రారంభం కావడానికి ముందే తను చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఈ పోస్ట్‌ ద్వారా తెలిపారు శ్రీకాంత్‌. విజయదశమికి ముందే తన కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన వీడియోను రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారు. తన తొలి సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్స్‌ విషయంలో కూడా కొత్తగా ఆలోచించిన శ్రీకాంత్‌ రెండో సినిమాకి కూడా అదే పద్ధతిని పాటిస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.