English | Telugu

దేవర టైటిల్ విషయంలో బయటకి వచ్చిన నిజం..టెన్షన్ గా ఉందంటున్న ఎన్టీఆర్  

యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)ఇంకో వారం రోజుల్లో మొత్తం ఐదు లాంగ్వేజ్ లలో దేవర(devara)గా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతున్నాడు. 2018 లో వచ్చిన అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న మూవీ కూడా దేవర నే. పైగా డ్యూయల్ రోల్ కావడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరు దేవర రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.ఎన్టీఆర్ తో పాటు చిత్ర బృందం మొత్తం ఆయా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

తాజాగా జరిగిన ఒక ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతు ఆర్ఆర్ఆర్(rrr)మాదిరిగా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకి చేరువయ్యే టైటిల్ ని ఫిక్స్ చెయ్యాలనుకొని దేవర అనే టైటిల్ ని ఫైనల్ చేసాం. దేవర అంటే దేవుడు అని అర్ధం.మా దేవర ప్రేక్షకులకి నచ్చుతుందనే నమ్మకం ఉంది.అందుకు తగ్గట్టుగానే టీం అందరం ఎంతో కష్టపడి పని చేసాం.కాకపోతే విడుదల దగ్గరయ్యే కొద్దీ కొంచం టెన్షన్ గా ఉంది ఆలాగే హీరోయిన్ గా ఫస్ట్ జాన్వీ ని అనుకోలేదు. కరణ్ జోహార్(karan johar)ఫోన్ చేసి మన సినిమాకి జాన్వీ అయితే బాగుంటుందని చెప్పాడు. దాంతో స్క్రిప్ట్ రైటింగ్ పూర్తయిన సమయానికి జాన్వీ మూవీలోకి ఎంటర్ అయ్యింది.యాక్టింగ్, లాంగ్వేజ్ విషయంలో మొదట కంగారు పడినా కూడా ఆ తర్వాత సూపర్బ్ గా చేసింది.తన యాక్టింగ్ స్కిల్ చూసి షాక్ కూడా అయ్యాయని చెప్పిన ఎన్టీఆర్ సంగీత దర్శకుడు అనిరుద్ పై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు.

విజయం అందుకున్న కొంత కాలానికి ఎవరైనా వివిధ కారణాల వల్ల విఫలం అవుతూ ఉంటారు. కానీ అనిరుద్ అలా కాదు. ఒక సినిమాకి సంగీతం ఎంత అవసరమో అనిరుద్ కి బాగా తెలుసు. అనుకున్న విధంగా రిజల్ట్ వచ్చే వరకు కష్ట పడుతూనే ఉంటాడు. తొందరలోనే ఏ ఆర్ రెహమాన్ లా అంతర్జాతీయ స్థాయికి వెళ్తాడని చెప్పుకొచ్చాడు.


Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.