English | Telugu
మోక్షజ్ఞ కన్నా ముందే కెమెరా ముందుకు తేజస్విని!
Updated : Oct 7, 2025
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కన్నా ముందే బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కెమెరా ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (Nandamuri Tejaswini)
కొంతకాలంగా బాలకృష్ణ సినిమా వ్యవహారాల్లో తేజస్విని చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే, అఖండ-2 సినిమాకి ప్రజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇన్నిరోజులుగా తెరవెనుక ఉన్న ఆమె, ఇప్పుడు తెర ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించడానికి తేజస్విని అంగీకరించారట. దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందని సమాచారం. త్వరలోనే యాడ్ ప్రసారం కానుందని అంటున్నారు. మరి తేజస్విని భవిష్యత్ లో సినిమాల్లో కూడా నటిస్తారేమో చూడాలి.