English | Telugu
షిర్డీలో నాగార్జున దంపతులు
Updated : Mar 13, 2011
నాగార్జున సాయిబాబాని సందర్శించిన అనంతరం అక్కడి విలేఖరులు "మీరు షిర్డీకి ఇంతకు ముందు వచ్చారా...?" అని అడగ్గా, దానికి నాగార్జున " లేదండీ. ఇదే మొదటి సారి రావటం. బాబాని దర్శించుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది" అని అన్నారు.
విలేఖరులు "మీరు బాబాని ఏం కోరుకున్నారు...?" అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగార్జున "ఏం కోరుకోలేదండీ... నేను అడక్కుండానే దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. అందుకే బాబాకి మనసారా నమస్కరించుకున్నాను".అని అన్నారు. విలేఖరులు " మీకు బాబాని చూడాలని ఎందుకనిపించింది....?" అన్న ప్రశ్నకు సమాధానంగా నాగార్జున " ఈ రోజు ఉన్నట్టుండి బాబాని చూడాలనిపించింది. అంతే వెంటనే వచ్చేశాను. ప్రత్యేకంగా కారణమంటూ ఏం లేదు" అని అన్నారు.