English | Telugu
కుర్రాడు మరీ ఓవర్ చేస్తున్నాడు
Updated : Dec 11, 2014
ఒకట్రెండు సినిమాలు చేయగానే, అవి ఓ మాదిరిగా ఆడగానే.. మాకంటే పోటుగాళ్లు లేరు అనుకొంటున్నారు కొంతమంది యువ హీరోలు. అప్పుడే మొలచిన హీరోయిజం చూసుకొంటూ మురిసిపోతున్నారు. పారితోషికాన్ని అమాంతం డబుల్ చేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. కొత్త కుర్రాడు నాగశౌర్య కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాడు నాగశౌర్య. మొన్నే లక్ష్మీ రావే మా ఇంటికి కూడా విడుదలైంది. తొలి రెండూ ఓ మాదిరి విజయాన్ని నమోదు చేసుకొన్నాయి. దాంతో.. నాగశౌర్య భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. రెండో సినిమాకి రూ.25 లక్షలు అందుకొన్న ఈ కుర్రాడు, మూడో సినిమాకొచ్చేసరికి రూ.60 లక్షలు డిమాండ్ చేశాడని టాక్. ఇప్పుడు నిర్మాతల తాకిడి మరింత ఎక్కువ అవ్వడంతో రౌండ్ ఫిగర్‌గా కోటి రూపాయలు చేసుకోండి... అంటున్నాడట. ఇది వరకు రూ.40 లక్షలకే ఓ సినిమా ఒప్పుకొన్నాడట. ఇప్పుడు ఆ నిర్మాతతో ''మరో అరవై ఇస్తే చేస్తా..'' అని లిటికేషన్ పెట్టాడట. ఇటీవల విడుదలైన లక్ష్మీ రావే.. ఫ్లాప్ అయినా ఈ కుర్రాడు దూకుడు తగ్గించడం లేదని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరో హిట్టు పడితే.. కుర్రాడు ఆగుతాడా..??