English | Telugu

వీడు మాస్ హీరో ఏంట్రా బాబూ..!

మాస్ అంటే బ‌స్సు పాసు కాదుబే... ఎవ‌డు ప‌డితే ఆడు పెట్టేసుకోవ‌డానికి అని ర‌వితేజ అంత క్లారిటీగా చెప్పిన త‌ర‌వాత కూడా మ‌సో... మ‌సో అంటూ క‌ల‌వ‌రిస్తోంది కుర్ర‌కారు. య‌మ‌ర్జెంటుగా మాస్ ఇమేజ్ తెచ్చేసుకొని.. ఏదో సాధించేద్దామ‌ని కుర్ర‌కారు క‌ల‌వ‌రింత‌ల‌కు గురైపోతున్నారు. ఆ లిస్టులో నాగ‌శౌర్య కూడా చేరిపోయాడు. రెండు మూడు ల‌వ్ స్టోరీలు చేశాడో లేదో.. ఇక చాలెహె... మ‌నం ఎక్కువ ల‌వ్ స్టోరీలు చేయ‌కూడ‌దు.. అని రిలాక్స‌యిపోయాడేమో.. ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం ప‌రిత‌పించేస్తున్నాడు. యోగి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న కొత్త సినిమా జాదూగాడులో మాస్ హీరోగా కొత్త ఇమేజ్ తెచ్చుకోవాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాలో నాగ‌శౌర్య ఫైటింగులూ గ‌ట్రా చేసేసి, కండలు గుండెలూ చూపించేసి... మాస్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసే ప‌నిలో ఉన్నాడు. అంతేకాదు.. ఎన్టీఆర్ - మ‌హేష్ - ప‌వ‌న్‌లా భారీ డైలాగులూ చెప్ప‌బోతున్నాడ‌ట‌. కుర్రాడు చూడ్డానికి లేత‌గా, కొల‌కొత్తా త‌మ‌ల‌పాకులా ఉంటాడు. అప్పుడే కారాకిళ్లీలాంటి వేషాలేంటి చెప్పండి??? చూద్దాం.. ఎంత జాదూ చూపిస్తాడో..??

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.