English | Telugu

ఎన్ఆర్ఐని పెళ్ళి చేసుకున్న జగపతిబాబు కూతురు

జగపతి బాబు వయసు ఎంతో తెలుసా… 53 సంవత్సరాలు. ఇది వార్త కాదు. మనకు తెలిసిన నిజమే. కానీ ఆయనకు పెళ్లికి ఎదిగిన కూతురుందని, ఆమెకు పెళ్లి అయ్యిందని తెలుసా? ఇంకో ఆశ్చర్యం కూడా ఉంది. ఆమె విదేశాల్లో చదువుతూ ఒక విదేశీయుడిని ప్రేమించి పెళ్లాడింది. ఆ పెళ్లిని తండ్రి దగ్గరుండి జరిపించారు. భారతీయ సంప్రదాయంలో సంగీత్ ఫంక్షను కూడా ఘనంగా జరిగింది. అయితే, బయటకు మాత్రం అంతా జరిగిపోయాక గానీ విషయం పొక్కలేదు. ఎనీ వే… గుడ్ న్యూస్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు న్యూ కపుల్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.