English | Telugu

రజినీకాంత్ కి షిఫ్ట్ అయిన నాగ్ అశ్విన్.. మరి ప్రభాస్..?

ఇటీవల 'కూలీ'తో ప్రేక్షకులకు పలకరించిన సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్-2' చేస్తున్నారు. అలాగే పలువురు దర్శకులు రజినీకాంత్ కి కథలు వినిపిస్తున్నారు. ఇటీవల 'కంగువా' ఫేమ్ శివ దర్శకత్వంలో రజినీ ఓ సినిమా చేయనున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు తెరపైకి వచ్చింది.

'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. 'మహానటి', 'కల్కి 2898 AD' సినిమాలతో ఎంతో పేరు సంపాదించారు. నిజానికి నాగ్ అశ్విన్ 'కల్కి-2' చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ కోసం చాలా రోజులు ఎదురుచూడాలి. అందుకే ఈలోపు మరో ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు నాగ్ అశ్విన్. ఆ మధ్య అలియా భట్ తో ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇటీవల రజినీకాంత్ ను కలిసి నాగ్ అశ్విన్ ఓ స్టోరీ లైన్ వినిపించారట. దానికి ఇంప్రెస్ అయిన రజినీ.. కంప్లీట్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు వినికిడి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందట.

టాలీవుడ్ కి చెందిన బాబీ, వశిష్ఠ, వివేక్ ఆత్రేయ వంటి దర్శకులు కూడా గతంలో రజినీకాంత్ కి కథలు చెప్పారు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ లు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ మాత్రం కార్యరూపం దాల్చే అవకాశముందని అంటున్నారు. అదే జరిగి రజినీకాంత్ తో నాగ్ అశ్విన్ సినిమా చేస్తే మాత్రం.. 'కల్కి-2' అనుకున్న దానికన్నా ఎక్కువ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.