English | Telugu

ఒక పాయింట్ దగ్గర డైవర్ట్ అయ్యాడు

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)రీసెంట్ గా 'హృతిక్ రోషన్' తో కలిసి వార్ 2(War 2)తో థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హిందీ కలెక్షన్స్ సంగతి ఎలా ఉన్నా, తెలుగుతో పాటు మిగతా చోట్ల పర్వాలేదనే స్థాయిలోనే కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఎన్టీఆర్ సెప్టెంబర్ నుంచి 'ప్రశాంత్ నీల్'(Prashanth Neel)తో జరుగుతున్న కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. త్రివిక్రమ్ మూవీ కూడా 'ఎన్టీఆర్' సినిమాల లైనప్ లో ఉన్న విషయం తెలిసిందే.


రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు వి. సముద్ర(V. samudra)తెలుగు వన్(Telugu One)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'బాలయ్యబాబు, ఎన్టీఆర్ తో నేను సినిమాలు చెయ్యకపోయినా, ఆ ఇద్దరితో మంచి రిలేషన్ ఉంది. ఆ ఇద్దరికి ఇప్పటికి నేనంటే నమ్మకం. ఎన్టీఆర్ నేను బాగా కలిసే వాళ్ళం. హరికృష్ణ(Harikirshna)గారితో సినిమా చేస్తున్నపుడు షూటింగ్ కి వచ్చే వారు. ఆ టైం లో ఎన్టీఆర్ కి కథ చెప్పాను. నేను తెరకెక్కిచిన కథలు కూడా చాలానే విన్నారు. కథలో ఒక పాయింట్ దగ్గర సముద్ర డైవర్ట్ అయ్యాడు. కానీ అద్భుతంగా చేసాడని ఎన్టీఆర్ చెప్పేవారు. ఇప్పటికి తన వాళ్ళ దగ్గర సముద్ర మంచి డైరెక్టర్ అని చెప్తారు. 'మహానంది' సినిమా కథ ఎన్టీఆర్ కోసమే రాసుకున్నానని సముద్ర చెప్పుకొచ్చాడు.

సముద్ర, హరికృష్ణ గారి కాంబోలో శివరామరాజు, టైగర్ హరిచంద్ర ప్రసాద్ లాంటి సినిమాలు వచ్చి ఒక దాన్ని మించి ఒకటి విజయాన్ని అందుకున్నాయి. ఇక మహానంది మూవీలో సుమంత్, శ్రీహరి ప్రధాన పాత్రలు పోషించగా అనుష్క హీరోయిన్ గా చేసింది. అనసూయ దేవి నిర్మించింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.