English | Telugu

కల్కి పార్ట్ 2 పై నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు.. వాళ్ళ మీదే ఆధారపడి ఉంది 

పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)'నాగ్ అశ్విన్'(Nag Ashwin)ల కాంబినేషన్ లో గత ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'కల్కి 2898 ఏడి'(Kalki 2898 ad). పురాణ ఇతిహాసాల నేపథ్యంతో పాటు,సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కగా, మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా 1100 కోట్ల రూపాయలని వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. కల్కి పార్ట్ 1 కి కొనసాగింపుగా పార్ట్ 2 ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ మేకర్స్ పార్ట్ 1 లోనే చెప్పడమే కాకుండా, అధికారకంగా కూడా ప్రకటించారు.

రీసెంట్ గా పార్ట్ 2 పై 'నాగ్ అశ్విన్' ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'కల్కి 2 షూటింగ్ చాలా అంశాలతో ముడిపడి ఉంది. కాంబినేషన్ సీన్స్ ని చిత్రీకరించాలంటే నటీనటుల డేట్స్ కుదరాలి. యాక్షన్ సన్నివేశాలు కూడా భారీగా ఉండబోతున్నాయి. వీటిని చిత్రీకరించడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి పార్ట్ 2 రిలీజ్ పై నా దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. ప్రస్తుతం 'కల్కి' లో నటించిన స్టార్స్ అందరు చాలా బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాను. షూటింగ్ తో పోల్చుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం పడుతుంది. మూవీని మరో రెండు సంవత్సరాల్లో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్(The Raja Saab)కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఆ వెంటనే హను రాఘవపూడి(Hanu Raghavapudi)మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది. 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత 'సందీప్ రెడ్డి వంగ'(sandeep reddy vanga)తో 'స్పిరిట్' అనే మూవీ చేస్తున్నాడు. మరి ఈ చిత్రాలన్నీ కంప్లీట్ అయ్యాక, ప్రభాస్ కల్కి 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడా, లేక ఆ చిత్రాలు సెట్స్ పై ఉండగానే జాయిన్ అవుతాడా చూడాలి. ఆ లెక్కన చూసుకున్నా, నాగ్ అశ్విన్ చెప్పినట్టుగా పార్ట్ 2 రావడానికి రెండు సంవత్సరాలు పట్టవచ్చు. మొదటి భాగం ఎండింగ్ లో దేవుడి అంశాన్ని గర్భంలో ఉంచుకున్న సుమతిని, 'అమరత్వం' కోసం 'సుప్రీం యాస్కిన్' తీసుకెళ్తాడు. భైరవ గత జన్మలో 'కర్ణుడు' అని, అశ్వథామకి తెలుస్తుంది. ఆ తర్వాత కథ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో ఉంది.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.