English | Telugu
'ముకుంద' ఆడియోలో మెగా సందడి
Updated : Dec 4, 2014
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'ముకుంద' సినిమా ఆడియో వేడుక హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సోదరుడు, హీరో తండ్రి నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, 'పిల్లా నువ్వులేని జీవితం' ఫేం సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్, హీరో శ్రీకాంత్ కనువిందు చేశారు. దీంతో అభిమానులు సందడి సందడి చేశారు.
'ముకుంద' ఆడియోను చిరంజీవి ఆవిష్కరించారు. ఆడియోను ఆవిష్కరించి, అల్లు అర్జున్ కు ఇవ్వాలని నిర్వాహకులు కోరగా, అల్లు అర్జున్ సున్నితంగా తిరస్కరించి, ఆ సీడీని సిరివెన్నెలకు ఇస్తే సముచితంగా ఉంటుందని అన్నాడు. దీంతో ఆడియో సీడీని ఆవిష్కరించి సిరివెన్నెలకు అందజేశారు. అనంతరం అల్లు అర్జున్ కు అందజేశారు.
ప్రతి పుస్తకానికి ముందు మాట ఉన్నట్టే మిత్రుడు, సరస్వతీ పుత్రుడు సిరివెన్నెల సీతారామశాస్త్రికి ముందు మాట్లాడడం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెలను సత్కరించారు. సరస్వతీ పుత్రుడ్ని సత్కరించడమంటే, సరస్వతీదేవిని సత్కరించడమేనని చిరు అభిప్రాయపడ్డారు. 'నాగబాబు పుత్రుడు, నా బిడ్డ వరుణ్ తేజ్ కు సిరివెన్నెల పాటలు రాయడం వరుణ్ అదృష్టమని' ఆయన తెలిపారు.
తన కుమారుడు వరుణ్ తేజ్ కు అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు, తమ్ముడు పవన్ కళ్యాన్ పవర్, అల్లుడు అల్లు అర్జున్ ఎనర్జీ, కొడుకు రాంచరణ్ ప్రేమ, సాయి ధరమ్ తేజ్ లవ్, అభిమానుల ఆశీస్సులు ఉన్నాయని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఎన్నో సినిమా అవకాశాలు ఉన్నప్పటికీ శ్రీకాంత్ అడ్డాల తన కుమారుడితో సినిమా చేయడం అదృష్టమని అన్నారు. అభిమానులు తన కుమారుడ్ని ఆదరించాలని నాగబాబు తెలిపారు.