English | Telugu
'ముకుంద' టీజర్ టాక్: మరో పవన్ కళ్యాణ్..!
Updated : Dec 4, 2014
మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ మొదటి 'ముకుంద' ఆడియో గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమా థియేట్రీకల్ ట్రైలర్ కూడా ఆడియో ఫంక్షన్ లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ఎలాంటి హడావుడి లేకుండా అతడి నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయాలనేది ఫాన్స్‌కి ఒక ఐడియా ఇచ్చేసారు. వరుణ్ తేజ్ మిగిలిన మెగా హీరోల మాదిరిగా పెద్ద డాన్సర్ కాదనే విషయం అయితే స్పష్టమైంది. అయితే బాగా చెయ్యలేడని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డాన్సులు రాకుండానే పవన్‌కళ్యాణ్ పవర్‌స్టార్ అయ్యాడు. ఇప్పుడు అదే బాటలో వెళుతున్నాడు. పవన్‌కళ్యాణ్ లాగే కమర్షియల్ సినిమాతో కాకుండా ఫ్యామిలీ సినిమాతో పరిచయమవుతున్నాడు వరుణ్ తేజ్. పవన్ కళ్యాణ్ లాగే వరుణ్ తేజ్ కూడా ఒక సపరేట్ ట్రెండ్ క్రియేట్ చేయాలని ఆశిద్దాం.