English | Telugu

మళ్ళీ హీరోగా మోహన్ బాబు

మళ్ళీ హీరోగా మోహన్ బాబు నటించనున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీజీవితాన్ని ప్రారంభించిన భక్తవత్సలం నాయుడు మోహన్ బాబుగా మారి అంచలంచెలుగా ఎదుగుతూ "కలెక్షన్ కింగ్" అనిపించుకుని విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత హీరోగా, నిర్మాతగా, అనంతరం శ్రీవిద్యానికేతన్ అనే విద్యాసంస్థను స్థాపించి విద్యాదాతగా, రాజకీయనాయకుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు.

ప్రస్తుతం పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబుగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. అలాంటి మోహన్ బాబు ఇప్పుడు మళ్ళీ హీరోగా ఒక సినిమాలో నటించటానికి నిర్ణయించుకున్నారట. ఆ సినిమాని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమా పేరు "వివేకానందుడు". ఈ సినిమా ప్రస్తుత రాజకీయాలపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం అని తెలిసింది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుందట.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.