English | Telugu

రొమాంటిక్ హీరోగా - మోహ‌న్ బాబు

కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు... ఈ పేరు విన‌గానే భారీ డైలాగులు అవ‌లీల‌గా ప‌లికే వైన‌మే గుర్తొస్తుంది. ఆయ‌న‌లోని రొమాంటిక్ యాంగిల్ ఉన్నా... బ‌య‌ట‌కు తీసుకొచ్చింది చాలా త‌క్కువ‌. అయితే ఈసారి ఆయ‌న పూర్తిస్థాయి రొమాంటిక్ హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నార‌ట‌. ఔను.. మోహ‌న్ బాబు చాలాకాలం త‌ర‌వాత మ‌ళ్లీ హీరోగా సందడి చేయ‌బోతున్నార‌ని తెలిసింది. రౌడీ త‌ర‌వాత ఆయ‌న మేక‌ప్ వేసుకొన్న‌దే లేదు. రౌడీలోనూ సీరియ‌స్ వేషం వేశారు. ఈసారి అలా కాకుండా.. ఓ వెరైటీ క‌థ‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారు. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు, ఏకంగా న‌లుగురు హీరోయిన్ల‌తో మోహ‌న్ బాబు రొమాన్స్ చేయ‌బోతున్నారు. ఓ మ‌రాఠీ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంద‌ని తెలుస్తోంది. ఆ రీమేక్ రైట్స్ సొంతం చేసుకొన్న ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ సంస్థ త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పై కి తీసుకెళ్లే అవ‌కాశాలున్నాయి. మే 20న మ‌నోజ్ పెళ్లి.. ఆ త‌ర‌వాతే మోహ‌న్ బాబు సినిమా మొద‌ల‌య్యే ఛాన్స్ ఉంది.