English | Telugu

మోహన్ బాబు 'పద్మశ్రీ' వివాదం ముగిసింది

ప్రముఖ సినీ నటుడు బాబుకు పద్మశ్రీ తిరిగొచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఆయన ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కరాన్ని కొనసాగించాలని తీర్పిచ్చింది. దీంతో మోహన్ బాబు మళ్లీ పద్మశ్రీ మోహన్ బాబు అవుతున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని మోహన్‌బాబు దుర్వినియోగం చేస్తున్నారంటూ గతంలో మోహన్‌బాబుపై కేసులు నమోదు కావడం, హైకోర్టు ఈ విషయమై సీరియస్‌గా స్పందించి, పద్మశ్రీని మోహన్‌బాబు ఉపయోగించుకోరాదని తేల్చి చెప్పిన విషయం విదితమే.ఈ నేపథ్యంలోనే మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇకపై ఎక్కడా పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేయబోమనని ప్రమాణం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు మోహన్‌బాబు. మోహన్‌బాబు అఫిడవిట్‌పై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ఇకనుంచి పద్మశ్రీ పురస్కారం మోహన్‌బాబుకి యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.