English | Telugu

కోపం తగ్గాలంటే ఆ పని చెయ్యి.. దటీజ్ మోహన్ బాబు 

సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటు ఎన్నో విశిష్టమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు పద్మశ్రీ 'మంచు మోహన్ బాబు'(MOhan Babu).సినీ రంగంలో ఆయన చూడని రికార్డు లేదు. ఎన్నో చిత్రాలు శతదినోత్సవాలు,సిల్వర్ జూబ్లీలు జరుపుకున్నాయి. గత నెలలో తనయుడు 'విష్ణు' టైటిల్ రోల్ పోషించిన 'కన్నప్ప'(Kannappa)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, 'మహాదేవ శాస్త్రి' అనే క్యారక్టర్ లో మరోసారి అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించాడు.

రీసెంట్ గా మోహన్ బాబు ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో సూపర్ స్టార్ తలైవా 'రజనీకాంత్'(Rajinikanth)గురించి ప్రస్తావనకి వచ్చింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతు రజనీకి నాకు మధ్య యాభై సంవత్సరాల అనుబంధంతో పాటు, ముద్దుగా 'హే బ్లడీ తలైవా' అని పిలిచేంత చనువు కూడా ఉంది. నటులుగా పరిచయం కాకముందు, మద్రాస్ రైల్వే
స్టేషన్ ప్లాట్ ఫామ్ పై కలిసాం. అప్పుడు మా ఇద్దరి దగ్గర ఏమి లేవు. రోజులో కనీసం మూడు నాలుగు సార్లు అయినా మెసేజ్ లు చేసుకుంటాం. ఇటీవల రజనీని కలిసాను. నాతో మాట్లాడుతు ' నాకు గతంలో ఎంత కోపం ఉండేదో నీకు తెలుసు. ఆ తర్వాత దాన్ని వదిలేసాను. కానీ నువ్వెందుకు వదలలేకపోతున్నావు. పుస్తకాలు చదవడం కాదు. అందులోని సారాంశాన్ని అర్ధం చేసుకొని కోపాన్ని వదిలేయ్ అని సలహా ఇచ్చాడని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

మోహన్ బాబు,రజనీకాంత్ మధ్య ఉన్నస్నేహబంధం గురించి అందరికి తెలిసిందే. రజనీకాంత్ కూడా చాలా సందర్బాల్లో మోహన్ బాబు తన ప్రాణస్నేహితుడిని చెప్పాడు. ఇద్దరు కలిసి చేసిన 'పెదరాయుడు' మూవీ తెలుగులో అనేక రికార్డులని నెలకొల్పింది. మరో సారి రజనీ, మోహన్ బాబు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రజనీ తన అప్ కమింగ్ మూవీ 'కూలీ'(Coolie)తో ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.