English | Telugu
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో దివంగత ముఖ్యమంత్రి కొడుకు
Updated : Sep 3, 2025
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Klayan)జన్మదిన వేడుకల్ని నిన్న వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. కూటమిలో భాగంగా తన జనసేన పార్టీ తరుపున పవన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండటంతో జనసేన తో పాటు తెలుగుదేశం, బిజెపి నాయకులు కూడా పలు ప్రాంతాల్లో జరిగిన పవన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే నంద్యాల(Nandyala)జిల్లా 'డోన్'(Dhone)తెలుగుదేశం పార్టీ ఏంఎల్ఏ 'కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి'(Kotla Surya Prakash Reddy)తన అసెంబ్లీ నియోజక వర్గంలో జరిగిన పవన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పవన్ కళ్యాణ్ చాలా మంచి నాయకుడు. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి. చిరంజీవి(Chiranjeevi)గారి కుటుంబానికి మా కుటుంబానికి, నాన్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచే మంచి అనుబంధం ఉంది. చిరంజీవి నేను కేంద్ర మంత్రులుగా కూడా పని చేసాం అని చెప్పుకొచ్చాడు. అనంతరం రక్తదానం చేసిన వాళ్ళకి సూర్యప్రకాష్ రెడ్డి సర్టిఫికెట్స్ అందచేసాడు. సూర్యప్రకాష్ రెడ్డి నాన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి(Kotla VijayaBhaskar Reddy) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.