English | Telugu

లిటిల్ హార్ట్స్ కి మిరాయ్ స్ట్రోక్! 

యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్, ఫాంటసీ జోనర్ లో తెరకెక్కిన 'మిరాయ్'(Mirai)నిన్నవరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా ప్రస్తుత కాలానికి, మన పురాణ ఇతిహాసాల్ని ముడిపెడుతు 'మిరాయ్' తెరకెక్కింది. నటీనటుల పెర్ఫార్మెన్స్ తో పాటు, 24 క్రాఫ్ట్స్ పనితనం మెస్మరైజ్ చెయ్యడంతో, ఒక కొత్త అనుభూతిని పొందుతున్నామనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శాతం రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. దీంతో 'మిరాయ్' భారీ కలెక్షన్స్ ని రాబడుతుందనే వ్యాఖ్యలు సినీ ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

ఈ ప్రభావం 'లిటిల్ హార్ట్స్'(Little Hearts)పై పడే అవకాశం ఉందనే చర్చ కూడా సినీ సర్కిల్స్ లో జరుగుతుంది. లిటిల్ హార్ట్స్ చిన్న చిత్రంగా విడుదలై మౌత్ టాక్ తో రోజు రోజుకి మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇందుకు ఆ చిత్రం తొలి రోజు నుంచి సాధిస్తున్న కలెక్షన్స్ లే ఉదాహరణ. ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుండటంతో చాలా ఏరియాల్లో థియేటర్స్ సంఖ్య కూడా పెంచారు. దీంతో ఎవరి ఊహలకి అందుకొని విధంగా రికార్డు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని అందరు భావించారు. కానీ ఇప్పుడు 'మిరాయ్' థియేటర్స్ లో అడుగుపెట్టింది. మౌత్ టాక్ పాజిటివ్ వస్తుండంతో ప్రేక్షకులు థియేటర్స్ కి పోటెత్తుతున్నారు. ప్రేక్షకుల డిమాండ్ తో ఈ రోజు నుంచి ఐదు షో లు కూడా ప్రదర్శిస్తున్నారు.

అందుకు తగ్గట్టే ఆన్ లైన్ బుకింగ్ కూడా చాలా ఏరియాల్లో ఫుల్ అయ్యాయి. వీకండ్ కావడంతో ప్రేక్షకులు లిటిల్ హార్ట్స్ కి వెళ్లే వాళ్ళని, ఇప్పుడు 'మిరాయ్' ప్రేక్షకుల ముందు కనపడుతుందనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో లిటిల్ హార్ట్స్ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.