English | Telugu

చిరంజీవి చెప్పిన రహస్యం

సర్దార్‌ గబ్బర్ సింగ్‌ ఆడియో వేడుకలో చిరంజీవి తన తమ్ముడి గురించి చాలా భావోద్వేగంగా ప్రసంగించారు. వాళ్లిద్దరికీ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూనే, పవన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. పనిలో పనిగా ఎప్పటిలాగే అభిమానుల అశీస్సుల గురించి కూడా తెగ పొగిడారు. కానీ చిరంజీవి ఉపన్యాసాన్ని కాస్త జాగ్రత్తగా గమనించినవారికి అందులో ఓ రాజకీయ రహస్యం వినిపించక మానదు.

రాజకీయాలలో మరింత చురుకైనా పాత్ర పోషించేందుకు, పవన్‌ సినిమాలకు దూరం కానున్నారన్న విషయాన్ని, తన ఉపన్యాసంలో ప్రస్తావించారు చిరంజీవి. ఏ రంగంలో అడుగుపెట్టినా ఉన్నత స్థానాలకు చేరుకుంటావనీ, అందుకోసం సినిమా రంగాన్ని మాత్రం దూరం చేసుకోవద్దంటూ పవన్‌కు చిరంజీవి సలహా ఇచ్చారు. ‘జోడు గుర్రాల మీద స్వారీ చేసే కెపాసిటీ నీకు ఉందం’టూ కితాబిచ్చారు. ఒకప్పుడు సినిమారంగంలో ఓ వెలుగు వెలిగి, రాజకీయాల కోసం కెరీర్‌ను ముగించారు చిరంజీవి. చిరంజీవి సినిమాల్లోనే కొనసాగితే, ఆ పరిస్థితే వేరుగా ఉండేదేమో. ఈ చేదు అనుభవంతో చిరంజీవి చెప్పిన సలహాగా వినిపిస్తున్నాయి ఆయన మాటలు. అంతేకాదు! చిరంజీవి మాటతీరు చూస్తుంటే భవిష్యత్తులో తను పవన్‌ జనసేనకు అండగా నిలబడే సూచనలూ కనిపిస్తున్నాయి.

అయితే ఇంకేం! 2019 ఎన్నికలలో మెగాబ్రదర్స్‌ కలిసి పోటీ చేయవచ్చన్నమాట. అన్న చిరంజీవి కాంగ్రేసుని వదిలి, తమ్ముడి బాట పట్టి నేరుగా అధికారాన్ని కూడా దక్కించుకోవచ్చునేమో. రాజకీయాలంటే ఎవరికి చేదు!

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.