English | Telugu
డ్యాన్స్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి..!
Updated : Mar 3, 2016
టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే, ఒకప్పుడు మెగాస్టార్ పేరు మాత్రమే వినబడేది. తెలుగు ప్రేక్షకులను అంతలా తన డ్యాన్సులతో మైమరపించారు చిరు. పాలిటిక్స్ లోకి వెళ్లిపోయిన తర్వాత, టాలీవుడ్ చిరు మార్క్ డ్యాన్స్ లను మిస్ అయింది. అందుకే ఇప్పుడు రీఎంట్రీలో డ్యాన్స్ ను ఇరగదీయాలని మెగాస్టార్ ఫిక్సయ్యారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఇప్పటికే సన్నబడి, మునపటి చిరులా కనిపిస్తున్న మెగాస్టార్, లేటెస్ట్ గా జుంబా డ్యాన్స్ కోసం ట్రైనర్ ను నియమించుకున్నారట. దీని వలన వెయిట్ తగ్గటమే కాకుండా, యాక్టివ్ గా కూడా ఉండచ్చనేది చిరు ఆలోచన. కుమార్తె శ్రీజ పెళ్లి పనులు ముగిసిన తర్వాత, తన కత్తి షూటింగ్ లో చిరు బిజీ అవనున్న సంగతి తెలిసిందే. మరి రీ ఎంట్రీ లో చిరు డ్యాన్స్ లు ఏ రేంజ్ లో అదరగొడతారో చూడాలి.