English | Telugu

చిరు... ఇప్పుడు గుర్తొచ్చిందా ఊరు?

చిరంజీవి న‌ట‌న తెర‌పైనే కాదు, రాజ‌కీయాల్లోనూ యమ రంజుగా ఉంటుంద‌న్న సంగ‌తి వేరే చెప్ప‌క్క‌ర్లేద్దు. కాక‌పోతే... న‌టుడిగా హిట్ అయిన చిరు.. పొలిటీషియ‌న్‌గా ఫ్లాప్ అయ్యాడు. ఏదో ఉద్ధ‌రించేస్తాడ‌ని గంపెడు ఆశ‌లు పెట్టుకొన్న‌చిరు అభిమానుల‌కూ... త‌న దైన శైలిలో `హ్యాండ్‌` ఇచ్చాడు. జ‌నం గురించి వాళ్ల స‌మ‌స్య‌ల గురించీ రాజ‌కీయాల గురించీ పెద్ద‌గా నోరు విప్ప‌ని చిరుది... పొలిటిక‌ల్ స్ర్కీన్ పై గెస్ట్ ఎంట్రీనే. అప్పుడ‌ప్పుడూ, అదీ అవ‌స‌ర‌మైతే త‌ప్ప పొలిటిక‌ల్ ట‌చ్ ఇవ్వ‌ని చిరుకి ఇప్పుడు స‌డ‌న్‌గా త‌న ఊరు, ప్ర‌జ‌లు, ఆద‌ర్శ గ్రామం గుర్తొచ్చాయి. పేరు పాలెంలోకి అడుగుపెట్టి.. `నా ఊరుని ఉద్ధ‌రిస్తా..` అంటూ స్పీచు దంచుకొట్టాడు. అది చూసి.. జ‌నాలు న‌వ్వుకొని వెళ్లిపోయారు. ఎంపీ నిధులతో చేయాల్సిన ప‌నుల్నికూడా.. ఇంత ఆల‌స్యంగా ప్రారంభించి, ద‌త్త‌త గ్రామాన్ని ఉద్ధరించ‌డానికి బ‌య‌ల్దేరిన చిరు ప్ర‌య‌త్నం వెనుక పెద్ద స్కెచ్చే ఉండి ఉండొచ్చ‌ని జ‌నాలు మాట్లాడుకొంటున్నారు.

పొలిటిక‌ల్‌గా ఎప్పుడు ఫ్లాప‌య్యాడో.. అప్పుడే చిరు స్టార్ ఇమేజ్ కూడా డామేజీ అవుతూ వ‌చ్చింది. ఇది వ‌ర‌క‌టిలా చిరు సినిమా అంటే ఎగ‌బ‌డే జ‌నం త‌గ్గిపోయారు. మొన్న‌టికి మొన్న బ్రూస్లీకి వ‌చ్చిన వ‌సూళ్లే ఇందుకు నిద‌ర్శ‌నం. ఆ సినిమాలో చిరు న‌టించినా..పెద్ద‌గా టికెట్లు తెగ‌లేదు. అన్న‌య్య‌ని చూడ్డానికి జ‌నం ఎగ‌బ‌డ‌లేదు. ఇప్పుడు సోలోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు చిరు. మ‌రి వ‌సూళ్లు వ‌స్తాయా? త‌న సినిమాకి కోట్లు కురుస్తాయా? బ‌హుశా చిరుకి ఇలాంటి అనుమానాల‌తో రాత్రిళ్లు నిద్ర‌ప‌ట్ట‌డం మానేసి ఉంటుంది. తాను అడుగుపెడితే.. ఇదివ‌ర‌క‌టిలా జ‌నం వెల్లువ‌లా వ‌స్తారా, రారా? అనే డౌటు వ‌చ్చుంటుంది.

అది తీర్చుకోవ‌డానికే... స‌డ‌న్‌గా పేరుపాలెంపై ప్రేమొచ్చి ఉంటుంది. ఇది చేస్తా. అది చేస్తా.. అంటూ అచ్చ‌మైన పొలిటీషియ‌న్‌గా మాడ్లాడిన చిరు, ఆ జ‌నంలో త‌న అభిమానుల్ని వెదుక్కొని ఉండి ఉండొచ్చు. `నేను మీ వాడినే. ఎక్క‌డికీ వెళ్లలేదు..` అని చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. సొంత ఊరిపై ప్రేమ ఉంటే.. ఎంపీ నిధుల‌తోనే అభివృద్ది చేయాల్సిన అవ‌స‌రం లేదు. అస‌లు ఎంపీ కావాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇది వ‌ర‌కెప్పుడూ గుర్తుకు రాని సొంతూరు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది. ఎల‌క్ష‌న్ల‌కు ముందు పొలిటిక‌ల్ క్యాంపెన్లు జ‌రిపిన‌ట్టు...త‌న సినిమాకి ముందు జ‌రిపిన ప్ర‌చారం కాబ‌ట్టి ఇది సినీ కాంపెనియింగ్ అనుకోవొచ్చా..?? చిరు.. దీనికి నీ ద‌గ్గ‌రైనా స‌మాధానం ఉందా?

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.